‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. మంచి బజ్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం నుంచి రానున్న అక్టోబర్ నుంచే హంగామా మొదలు కానుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ముందుగా ట్రైలర్ వచ్చేసి తర్వాత మొదటి సాంగ్ రానుంది.

రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫస్ట్ సింగిల్ ని ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అంటే అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. సో అలాగే కాంతార 1 తో మొదటి ట్రైలర్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దీనితో ది రాజా సాబ్ విషయంలో అక్టోబర్ లో డబుల్ బ్లాస్ట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version