పుష్ప విలన్‌తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!

96, సత్యం సుందరం వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ సి ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా తమిళ్ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ డైరెక్టర్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ప్రేమ్ కుమార్ సి తన నెక్స్ట్ చిత్రాన్ని తొలుత హీరో విక్రమ్‌తో చేయాలని భావించాడట. కానీ, ఎందుకో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రానికి ఫహద్ ఫాసిల్‌ను హీరోగా తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్న చిత్రంలో తనదైన ఎమోషనల్ కంటెంట్‌ను నింపేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడట.

45 నిమిషాల నరేషన్‌తో ఫహాద్‌ను ప్రేమ్ కుమార్ ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో తమిళంలో ఫహాద్‌కు తొలి సోలో హిట్ దక్కడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ 2026 జనవరిలో మొదలుకానుంది.

Exit mobile version