అసిన్ ఎందుకంత అసంతృప్తికి గురైంది?

అసిన్ ఎందుకంత అసంతృప్తికి గురైంది?

Published on Oct 7, 2012 1:09 PM IST


సౌత్ ఇండియాలో పెద్ద హీరోలందరితో నటించి పెద్ద పెద్ద విజయాలు అందుకున్న అసిన్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా భారీ విజయాలను అందుకుంది. అలాంటి అసిన్ ఇప్పుడు పూర్తి అసంతృప్తికి గురైంది. చాలా కాలం తర్వాత ఇండియన్ ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ప్రీమియర్ షోకి వెళ్ళలేక పోవడమే అసిన్ అసంతృప్తికి గల కారణం. అసిన్ ని బోనీ కపూర్ మరియు శ్రీ దేవి కలిసిమరీ ప్రీమియర్ షోకి ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం అసిన్ తన కాలుకి తగిలిన గాయానికి చికిత్స పొందుతూ ఉండడం వల్ల ఈ షోకి హాజరు కాలేకపోయారు. అసిన్ మరియు శ్రీ దేవి మంచి స్నేహితులు, అలాగే పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. అసిన్ చాలా కాలం తర్వాత వచ్చిన శ్రీ దేవి గారి సినిమాని చూడలేక పోయాను అని చాలా భాద పడుతోంది. కానీ త్వరలోనే ఈ సినిమా చూస్తానని అసిన్ శ్రీ దేవికి మాట ఇచ్చారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం గత శుక్ర వారం విడుదలై అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

తాజా వార్తలు