చిరు రీమేక్ లో ఈ రోల్ ను భర్తీ చేసేది ఎవరు?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం కావడనికి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం అనంతరం చిరు లైన్ లో రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరొకటి వేదాళం రీమేక్. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మొదటగా మాత్రం చిరు వినాయక్ తో ప్లాన్ చేసిన లూసిఫర్ రీమేక్ నే టేకప్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యి చిరు కూడా ఓకె చెప్పేసారు కానీ ఇపుడు ఈ చిత్రంలో హీరోతో పాటుగా మరో కీలక రోల్ కూడా కనబడుతుంది. ఆ పాత్రకు ఇంకా చిత్ర యూనిట్ ఎవరినీ ఫిక్స్ చెయ్యనట్టే తెలుస్తుంది. మళయాళంలో అయితే పృథ్వీ రాజ్ నటించిన ఈ రోల్ లో మన టాలీవుడ్ నుంచి ఏ హీరో చేస్తారో అన్నది చూడాలి.

Exit mobile version