హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కార సందడి మొదలైంది. ఈ సారి ఉత్తమ నటుడు అవార్డుకి హ్యూ జాక్ మ్యాన్, డెంజిల్ వాషింగ్టన్, జోక్విన్ ఫోనిక్స్, డేనియల్ డే లెవిస్, భ్రాడ్లీ కూవర్ లు నామినేట్ అయ్యారు. ఈ సారి ఈ ఆవార్డ్ ఎవరికి దక్కబోతుందని అందరిలో ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. హ్యూ జాక్ మ్యాన్ ‘లెస్ మిసరబుల్స్’ సినిమాలో నటించగా మంచిగా మారిన ఒక మాజీ ఖైది పాత్రలో నటించాడు. డెంజిల్ వాషింగ్టన్ ‘ప్లైట్’ సినిమాలో తను చేసిన పైలెట్ విలే విటేకర్ అనే పాత్రకి, జోక్విన్ ఫోనిక్స్ నటించిన ‘ది మాస్టర్’ సినిమాలో ఫ్రెడ్డీ క్వెల్ పాత్రకి, డేనియల్ డే లెవిస్ నటించిన ‘లింకన్’ సినిమాలోని ప్రధాన పాత్రకి , భ్రాడ్లీ కూవర్ సినిమా ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ లోని ప్యాట్ పాత్రలకి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన ఈ ఐదుగురి లో ఆస్కార్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.