రెండో రోజు దూకుడు పెంచిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri

తేజ సజ్జా హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచే ఆక్యుపెన్సీలు, వసూళ్లు అంటూ ఈ సినిమా దూకుడు ప్రదర్శిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన బెల్లకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు చిత్రాల క్లాష్‌తో ఏ సినిమాకు డ్యామేజ్ జరుగుతుందా అని అందరూ చూశారు.

కానీ, ఈ రెండు సినిమాలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఇక కిష్కింధపురి మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ సాధించి, రెండో రోజు కలెక్షన్లలో మంచి జంప్ చూపించింది. కొన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్స్ నమోదయ్యాయి. దాంతో రెండో రోజు వసూళ్లు, ఫస్ట్ డే కంటే ఎక్కువగా ఉంటాయని అంచనాలు. మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నా, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా నెమ్మిదిగా తనదైన ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.

ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, నటీనటుల నటనపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోండటం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరోసారి తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం కిష్కింధపురి నిరూపించింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మించగా చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version