‘హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. దసరా విజయానంతరం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని రెండోసారి కలసి పనిచేస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతున్న వేళ, నటి లక్ష్మీ మంచు అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. “ఇది ఇంకా అధికారికంగా బయటకువచ్చిందా తెలియదు. కానీ నేను చెప్పేస్తాను. నాన్నగారు (మోహన్ బాబు) ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆ లుక్ కోసం ఆయన ఈ వయసులోనూ తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రతి సినిమాను తన మొదటి సినిమాలా తీసుకునే ఆయన నిజంగా చాలా ఇన్‌స్పైరింగ్.” అని అన్నారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 26, 2026లో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.