అనుష్క తర్వాత ఐశ్వర్య కూడా ఔట్..!

Anushka-Shetty-Aishwarya-La

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి రీసెంట్‌గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ అభిమాన నటి ఇలా సోషల్ మీడియాకు దూరంగా వెళ్లడం సబబు కాదని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆమె తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అనుష్క బాటలో వెళ్తోంది. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా నుంచి క్విట్ అవుతున్నట్లు పేర్కొంది. ఆమె సోషల్ మీడియా కారణంగా క్రియేటివ్‌గా ఆలోచించలేకపోతున్నట్లు పేర్కొంది. అంతేగాక, ఆమె చేస్తున్న పనిపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆమె తెలిపింది.

దీంతో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఐశ్వర్య లక్ష్మి నిర్ణయంతో ఆమె అభిమానులు కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version