నాగచైతన్య లాంచ్ చేసిన ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్

Beauty

ప్రేమ, కుటుంబ విలువలు, తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్షన్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. ఈ సినిమాను జె.ఎస్.ఎస్. వర్ధన్ డైరెక్ట్ చేస్తుండగా, కథ-స్క్రీన్‌ప్లే ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విడుదల చేయగా, ఆలోచింపజేసే డైలాగ్స్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఫాదర్-డాటర్ బాండింగ్ ఆకట్టుకుంటున్నాయి. ‘’ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు’, ‘నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా’ క్యాబ్ డ్రైవర్ అయితే డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు’ వంటి డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

విజువల్స్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నరేష్, వాసుకి, సోనియా చౌదరి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఎడిటింగ్ వర్క్ ఎస్.బి. ఉద్ధవ్ చూస్తున్నారు. ‘బ్యూటీ’ సినిమాను సెప్టెంబర్ 19న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version