ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను AA26xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన తొలి హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇటీవల రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుందనే విషయాన్ని వారు గ్రాండ్‌గా రివీల్ చేశారు. కాగా, ఈ సినిమాకు సంగీతాన్ని ఎవరు అందిస్తున్నారు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇప్పటికే పలువురు పేర్లు వినిపించినా, అందులో ఎవరి పేరు కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. దీంతో ఇలాంటి ప్రెస్టీజియస్ సినిమాకు సంగీతం అందించేది ఎవరా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.