‘అఖండ 2 టీజర్’.. లాజిక్ ని కూడా ఎగరేసిన బోయపాటి మాస్

మొదటిగా నటసింహ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాలయ్య కెరీర్లో మాస్ సినిమాలు ఎన్నో చేశారు. అయితే తనకి సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న మాస్ దర్శకుల్లో ఒకప్పుడు బి గోపాల్ గారు ఉంటే ఇప్పుడు తరంలో మాత్రం బోయపాటి శ్రీను మాత్రమే తన బి గోపాల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి రికార్డులు బ్రేక్ చేసాయి.

మరి నాలుగో సినిమా వస్తున్నా ఆ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2 తాండవం”. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇపుడు చర్చగా మారింది. మామూలుగానే బోయపాటి అంటేనే మాస్ తన సినిమాల్లో లాజిక్స్ వెతక్కుండా జస్ట్ మాస్ ని ఎంజాయ్ చేసి వచ్చేయాలి అని మాస్ ఆడియెన్స్ అంటుంటారు. సరిగ్గా ఇదే మళ్ళీ అఖండ 2 కి కూడా జరిగింది అని చెప్పవచ్చు.

టీజర్ లో ఒకటీ రెండు షాట్స్ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఓవరాల్ గా మాత్రం ఆడియెన్స్ సోషల్ మీడియాలో ఆ లాజిక్స్ ని మించి టీజర్ లోని మాస్ ని బోయపాటి బాలయ్యల తాండవంని మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బోయపాటి తన మాస్ మ్యాజిక్ తో లాజిక్ ను కూడా ఎగరేశారని చెప్పవచ్చు.

Exit mobile version