‘కుబేర’కు షాకింగ్ రన్ టైం లాక్ చేసిన శేఖర్ కమ్ముల!? వర్కౌట్ అవుతుందా?

టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కింగ్ నాగార్జున కలయికలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. ధనుష్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన శేఖర్ కమ్ముల నుంచి కూడా కాస్ట్లీ సినిమాగా రాబోతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు అన్ని పనులూ కంప్లీట్ చేసుకుంటూ వస్తుండగా ఓ షాకింగ్ రన్ టైం సినిమాకి లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

దాదాపు శేఖర్ కమ్ముల సినిమాలు దాదాపు ఒకింత ఎక్కువ రన్ టైం లోనే కనిపిస్తాయి. మరి అలానే కుబేర కి అంతకు మించిన రన్ టైం ని శేఖర్ కమ్ముల కట్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది అని వినిపిస్తుంది. అయితే ఇంత పెద్ద రన్ టైం ఉన్నా కూడా పలు సినిమాలు థియేటర్స్ లో జనాన్ని కూర్చోబెట్టాయి.

మరి ఇదే ఈ సినిమాకి పెద్ద సవాలు అని చెప్పాలి. ఇంతసేపు ఆడియెన్స్ ని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఉంటే పర్వాలేదు కానీ కొంచెం తేడా అయినా ఎఫెక్ట్ అవుతుంది. మరి మేకర్స్ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలియాలి అంటే ఈ జూన్ 20 వరకు ఆగి చూడాల్సిందే.

Exit mobile version