‘హరిహర వీరమల్లు’కి ప్రముఖ ఓటీటీ అల్టిమేటం!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ లు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమానే హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా ఎన్నో డేట్స్ నుంచి వాయిదా పడుతూనే వస్తుంది. ఇది ఈ సినిమా ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి కూడా సమస్యగా మారింది.

అయితే గతంలో కూడా వీరు సినిమా ఆన్ టైం లో రావాలని ప్రెజర్ చేసినట్టు టాక్ వినిపించింది. మరి ఈసారి మాత్రం అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. గత రెండు సార్లు మిస్ చేసిన డేట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈసారి మాత్రం జూలై ఎండింగ్ లోపే థియేటర్స్ లో సినిమా విడుదల చేయాలని అల్టిమేటం మేకర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో హరిహర వీరమల్లు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈలోపు థియేటర్స్ లోకి రావచ్చని చెప్పొచ్చు.

Exit mobile version