పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లపూడి డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రం హిస్టారికల్ ఎపిక్గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది
అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ క్లారిటీగా లేరని.. పలు వార్తు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మవద్దని.. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను తాము అధికారికంగా అనౌన్స్ చేసే వరకు అభిమానులు వెయిట్ చేయాలని మేకర్స్ కోరారు.