పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. శ్రుతి హాసన్, పవన్ సరసన నటించబోతుందని వార్తలు రాగా.. ఇటీవలే శ్రుతి హాసన్ నేను నటించట్లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ హీరోయిన్ గురించి ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తోందని తెలుస్తోంది. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కి అండ్ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోని కపూర్ సమర్పిస్తున్నారు. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హీరోయిన్ లేకుండానే మేకర్స్ ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?