పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఓజి థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఆ మధ్య మరింత ఉత్సాహాన్ని అందించాయి.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజి చిత్రానికి వచ్చిన కళ్ళు చెదిరే రేట్లు షాకిచ్చాయి. అయితే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఓజి సినిమా ఏకంగా 150 కోట్లకి పైగా బిజినెస్ ని చేసినట్టుగా టాక్. ఇక ఓవర్సీస్ సహా ఇతర భాషలు కలిపి సుమారు 50 కోట్ల లోపు ఉంటుంది అని తెలుస్తుంది.
ఇలా మొత్తానికి ఓజి సినిమాకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంటే తప్ప గట్టెక్కదు అని సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. కానీ ఏమాత్రం టాక్ పడినా కూడా దసరా రేస్ లో ఓజి చిత్రానికి 300 కోట్ల మార్క్ అనేది ఈ హైప్ లో చాలా ఈజీ అని చెప్పవచ్చు. మరి చూడాలి ఈ సినిమా విషయంలో ఏమవుతుంది అనేది.