ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య

ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య

Published on Sep 20, 2025 6:41 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు పాన్ ఇండియా నుంచి ఇంటెర్నేషనల్ లెవెల్లో సినిమాలు చేసే విధంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తుండగా ఇంకోపక్క తన కుటుంబంతో కూడా సమయం దొరికినప్పుడు అంతా కలిసి కనిపిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఒకింత యాక్టీవ్ గానే ఉంటారని తెలిసిందే.

అలానే ఒకోసారి తన ఫాలోవర్స్ తో చాట్ సెషన్స్ కూడా పెడుతూ ఉంటారు. అలా తనకి ఎదురైన ప్రశ్నలో తమ ఫ్యామిలీ నుంచి బాగా ఇష్టమైన ఫోటో ఏది అంటే ఒక పిక్ ని షేర్ చేసుకున్నారు. మరి ఇందులో నలుగురు క్యూట్ ఫ్యామిలీ కనిపిస్తుండగా ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ ఒకే లాంటి బట్టలు వేసుకుంటే అల్లు స్నేహ అలాగే కొడుకు అయాన్ లు సేమ్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపిస్తున్నారు. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ మంచి ఫోటో మూమెంట్ గా మారింది.

తాజా వార్తలు