నాని హీరోగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. ఉగాది కానుకగా ఈనెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న సీరియల్ కిల్లర్ రోల్ చేస్తుందా నాని కోసం వెతికే పోలీస్ అధికారిగా సుధీర్ నటిస్తున్నారు. వీరి మధ్య సినిమాలో ఆసక్తికర పోరు నడుస్తుందని, ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
‘వి’ మూవీలో హీరోయిన్స్ గా నివేదా థామస్ మరియు అదితి రావ్ హైదరి నటిస్తున్నారు. నేడు విడుదల చేసిన పోస్టర్ సుధీర్, నివేదా ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని తెలిపేలా ఉంది. నివేదా సుధీర్ మరియు నాని లకు హీరోయిన్ గా నటిస్తుందా లేక సుధీర్ కి మాత్రమే జంటగా కనిపిస్తుందా అనేది అర్థం కాలేదు. ఒక వేళా అదితి రావ్ హైదరి నాని హీరోయిన్ అయ్యే అవకాశం కలదు.