‘మన వరప్రసాద్ గారు’ బ్యాక్ డ్రాప్ రివీల్ చేసిన దర్శకుడు!

‘మన వరప్రసాద్ గారు’ బ్యాక్ డ్రాప్ రివీల్ చేసిన దర్శకుడు!

Published on Aug 22, 2025 3:26 PM IST

Mana Shankara Varaprasad Garu

ప్రస్తుతం మెగా అభిమానులకి సోషల్ మీడియాలో ఫుల్ ఫీస్ట్ నడుస్తుంది అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా వచ్చిన సినిమాల అప్డేట్స్ అదిరే లెవెల్ ట్రీట్ ని అందిస్తుండడంతో వాటితో వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ “మన వరప్రసాద్ గారు” లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు అనీల్ రావిపూడి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది.

దీనితో ఈ సినిమా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్ లో అందులో 90 శాతం ఎంటర్టైన్మెంట్ కామెడీ మిస్ కాకుండా మెగాస్టార్ అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ తో తాను తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి గ్లింప్స్ లో మెగాస్టార్ పట్టుకున్న మెషిన్ గన్స్ అవీ చూస్తేనే అందరికీ అర్ధం అయ్యి ఉండొచ్చు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఆ తరహాలోనే ఉండొచ్చు అని సో మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం బాస్ రఫ్ఫాడించడమే బాకీ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు