పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!

పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!

Published on Aug 22, 2025 10:07 AM IST

తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు కావడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఈ బిగ్ డే ని జరుపుకుంటున్నారు. మరి మెగాస్టార్ కి దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు అంతా తమ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన బ్యూటిఫుల్ విషెస్ కి మెగాస్టార్ తన మార్క్ లో అంతే రీతో ఎమోషనల్ రిప్లై అందించారు.

“జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు! త‌మ్ముడు క‌ల్యాణ్‌… ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది.

ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను.” అని తెలిపారు. దీనితో ఈ రిప్లై చూసిన మెగా అభిమానులు మరింత భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు