పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కి, సినిమా అభిమానులకు పండుగే. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమా విడుదల తేదిపై ఇప్పటి వరకు ఒక నిర్ణయం వెలువడలేదు. కొన్ని రోజులకు ముందు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా ఆగష్టు 21న విడుదలవుతోందని భావించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట ఈ సినిమా విడుదలయ్యేలా కనిపించడం లేదు. అయితే సినిమా సెప్టెంబర్ విడుదల కావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. కానీ ఆగష్టు చివరి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంకా నిర్దారణకాలేదు. ఈ సినిమా నిర్వహకులు రాష్ట్రంలో పరిస్థితి కాస్త సద్దుమనిగితే సినిమాను వీలైనంత త్వరగా విడుదల చెయ్యాలని చూస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరొయిన్ గా నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా మార్కెట్ లోమంచి పేరును సంపాదించుకుంది. పరిస్థితులన్ని సద్దుమనిగి ఈ సినిమా త్వరగా విడుదలకావాలని ఆశిద్దాం.