తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్

తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్

Published on Sep 17, 2025 2:04 PM IST

yedu-tarala-yuddham

ఈ రోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఓ ఇంటెన్స్ ప్రాజెక్ట్ ఒకటి ఆ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఆ చిత్రమే “ఏడు తరాల యుద్ధం”. ఒక సాలిడ్ పోస్టర్ తో మేకర్స్ 1948 సమయంలో నిజాం చివరి తరంతో పోరాటం చేసిన తెలంగాణ విప్లవ సమయం సంఘటనల ఆధారంగా అనౌన్స్ చేసిన సినిమానే ఇది.

అప్పటి సమయంలో మగవారు, ఆడవారు, రైతులు తమ స్వేచ్ఛ కోసం తమ గౌరవం కోసం చేసిన పోరాటమే ఈ కథ. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బొమ్మ వేణు గౌడ్ తెరకెక్కిచనుండగా తానే ఎడిటర్ గా మరియు వి ఎఫ్ ఎక్స్ పనులు కూడా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ హిస్టారికల్ చిత్రాన్ని భవిష్యత్ తరాలకి గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చే విధంగా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

తాజా వార్తలు