ఇక ‘కింగ్డమ్’ పై క్లారిటీ ఎప్పుడు?

ఇక ‘కింగ్డమ్’ పై క్లారిటీ ఎప్పుడు?

Published on Jun 21, 2025 10:11 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “కింగ్డమ్”. ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కూడా కొంచెం సస్పెన్స్ గానే మారింది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ దీనిపై క్లారిటీ కోరుకుంటున్నారు.

అయితే ఈ జూలై 4కి లాక్ అయ్యిన సినిమా ప్రస్తుతం ఎలాంటి చప్పుడు చేయడం లేదు. సో వాయిదా అనేది కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇంకోపక్క జూలై 24 లేదా 25న హరిహర వీరమల్లుతో క్లాష్ ఉంటుంది అనేది బయటకి వచ్చింది. ఇందులో పవన్ సినిమా డేట్ జూలై 24 కి ఫిక్స్ అయ్యింది. ఇక కింగ్డమ్ నుంచి రిలీజ్ క్లారిటీ రావడం అనేది ఒక్కటి బాకీ ఉందని చెప్పాలి. మరి మేకర్స్ ఎప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తారో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు