జూలై 24.. సెన్సేషనల్ డేట్‌పై కన్నేసిన వీరమల్లు..?

జూలై 24.. సెన్సేషనల్ డేట్‌పై కన్నేసిన వీరమల్లు..?

Published on Jun 21, 2025 3:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌పై సైలెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, సినీ సర్కిల్స్‌లో ఈ రిలీజ్ డేట్‌పై ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

హరిహర వీరమల్లు చిత్రాన్ని జూలై 24న ఏదేమైనా రిలీజ్ చేసి తీరుతారనేది ఈ వార్తలో పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ హరిహర వీరమల్లు చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గకుండా ఉండేలా ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

అంతేగాక, ఇదే జూలై 24వ తేదీన పవన్ కల్యాణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘తొలిప్రేమ’.. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ కూడా రిలీజ్ కావడంతో.. ఈసారి ఈ డేట్‌ను ఖచ్చితంగా లాక్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు