బ్రేకింగ్: ‘వీర’ ఆగమనంకి కొత్త డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే

బ్రేకింగ్: ‘వీర’ ఆగమనంకి కొత్త డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే

Published on Jun 21, 2025 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లాంగ్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. తన నుంచి ఒక భారీ హిస్టారికల్ చిత్రంగా అనౌన్స్ చేసినపుడు సాలిడ్ హైప్ ఈ సినిమాపై నెలకొంది. కానీ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూ రావడం లాస్ట్ మినిట్ కూడా వాయిదా పడుతుండడం అనేది మాత్రం ఫ్యాన్స్ కి బాగా ఇబ్బందిగా మారింది. అయితే ఎట్టకేలకి హరిహర వీరమల్లు తాలూకా ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

మేకర్స్ ఈ చిత్రాన్ని రీసెంట్ గా వినిపిస్తున్న డేట్ జూలై 24 కే థియేటర్స్ లో వస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ సహా నటుడు బాబీ డియోల్ పై డిజైన్ చేసిన దానితో రిలీజ్ చేసేసారు. సో మొత్తానికి వీర ఆగమనం ఈ డేట్ లో ఉండనుంది అని చెప్పాలి. ఇంకా నెల రోజుల సమయంలో సినిమాకి పోయిన హైప్ ని మేకర్స్ మళ్ళీ తెచ్చుకుంటారా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు