మహేష్ అలా అనడంతో షాక్ తిన్నా- కొరటాల శివ

మహేష్ అలా అనడంతో షాక్ తిన్నా- కొరటాల శివ

Published on Apr 17, 2020 11:01 AM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఓ తెలుగు డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కొత్త సినిమాకి సంబందించిన అనేక విషయాలు పంచుకున్నాను. మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేస్తున్న ఆచార్య మూవీలో మహేష్ నటిస్తున్నాడంటూ వచ్చిన వార్తపై కూడా ఆయన స్పందించారు.

”ఓ బాధ్యత కలిగిన యువకుడి పాత్ర కోసం చరణ్ ని అనుకుంటున్నాను అని చెప్పగా చిరంజీవి గారు ఓ.కే బాగుంటుంది అన్నారు. అదే విషయాన్ని చరణ్ కి చెప్పగా ఆయన పచ్చ జెండా ఊపారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీనితో చరణ్ డేట్స్ విషయంలో నాకు టెన్షన్ మొదలైంది. అదే టైం లో మహేష్ తో మాట్లాడాను.ఆయన సినిమా విడుదల ఎప్పుడని అడుగగా… ఆ విషయంలోనే స్పష్టత రావడం లేదు అన్నాను. దానికి మహేష్ నేనున్నాను.. మీరు టెన్షన్ పడకండి అన్నారు. ఆయన అలా అనడం నాకుషాక్ ఇచ్చింది. అంత పెద్ద హీరో అలా స్పందించడంతో నేను ఆ విషయాన్ని కొందరితో పంచుకున్నాను. అది కాస్తా మహేష్ ఆచార్యలో నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది” అని కొరటాల అసలు విషయం చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు