స్టార్ హీరోల అభిమానులకు ఫాన్ ఇండియా మూవీ పిచ్చిపట్టింది. తమ అభిమాన హీరో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తే చూసి ఆనందించాలని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సినిమాలు చేసి ప్రభాస్ టాలీవుడ్ నుండి ఎవరికి అందనంత దూరంలో ఉండగా, చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆ ఫీట్ చేరుకోనున్నారు. ఐతే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్, పవన్ మరియు అల్లు అర్జున్ ఈ ఫీట్ కి ఇంకా చాల దూరంలో ఉన్నారు.
మహేష్ అభిమానులు ఎప్పటి నుండో రాజమౌళితో ఆయన పాన్ ఇండియా మూవీ చేయాలని కోరుకుంటున్నారు. అది కుదరలేదు, ప్రశాంత్ నీల్ తో ఆయన సినిమా కుదిరితే అది పాన్ ఇండియా లెవల్ లో ఉంటుందని భావించారు. ఇక పవన్ ది కూడా అదే పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన ఓ పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఐతే క్రిష్ తో ఆయన చేస్తున్న మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే అవకాశం కలదు. ఇక మరో స్టార్ హీరో బన్నీ కూడా పాన్ ఇండియా మూవీ చేయడం కానీ, ఒప్పుకోవడం కానీ చేయలేదు.