ఎన్టీఆర్ హస్తినకు పోయేదీ, లేనిది..ఆ రోజు తెలుస్తుంది..?

ఎన్టీఆర్ హస్తినకు పోయేదీ, లేనిది..ఆ రోజు తెలుస్తుంది..?

Published on Apr 18, 2020 7:13 AM IST

ఫ్యాన్స్ కి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు చాల స్పెషల్. ఎందుకంటే ఆరోజు ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఆయన ఇంట్రడక్షన్ వీడియో విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ పుట్టిన రోజు కానుకగా భీమ్ పర్ రామరాజు పేరుతో విడుదల చేసిన అల్లూరిగా చరణ్ ఇంట్రో వీడియో భారీ ఆదరణ దక్కించుకుంది. చరణ్ పరిచయ వీడియోకి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ వీడియో ఉంటుంది అనడంలో సందేహం లేదు. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20 కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు.

కాగా ఎన్టీఆర్ తన 30వ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేస్తుండగా, మే నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా త్రివిక్రమ్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ పోస్టర్ త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పటికే అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ప్రచారం లో ఉంది. మే 20న దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు