రామ్ చరణ్ ‘ఎవడు’కి ఏం జరుగుతోంది?

రామ్ చరణ్ ‘ఎవడు’కి ఏం జరుగుతోంది?

Published on Nov 24, 2013 4:21 AM IST

yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలకి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల ప్రభావం బాగా ఎక్కువగా తాకుతోంది. ఈ సినిమా ముందుగా అనుకున్న దాని ప్రకారం కొద్ది నెలల క్రితమే విడుదల కావాలి. కానీ అప్పట్లో రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితుల వల్ల అప్పుడు రిలీజ్ కాలేదు.

ఇటీవలే దిల్ రాజు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నామని తెలియజేశాడు. కానీ ట్రేడ్ పండితులు ఎవడు ఆ డేట్ కి కూడా రిలీజ్ కాదని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజుని రిలీజ్ డేట్ ని వాయిదా వెయ్యమని ఫోర్స్ చేస్తున్నట్లు సమాచారం. చెప్పాలంటే తెలంగాణ బిల్ డిసెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల మళ్ళీ రాష్ట్రంలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇలాంటి సమస్యల నడుమ దిల్ రాజు సినిమాని విడుదల చేసి ఎందుకు రిస్క్ చేస్తున్నాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాయిదా వేయడానికి ఇంకొక కారణం కూడా ఉందని సమాచారం. అదేమిటంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ డిసెంబర్ 19 రిలీజ్ కి ఓకే అంటుంటే కొంతమంది మాత్రం డిసెంబర్ లో వద్దని సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయమని అడుగుతున్నారు. ప్రస్తుతానికయితే ఈ సినిమాని డిసెంబర్ 19నే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది ఆ రోజే రిలీజ్ అవుతుందా? లేదా? అనేది చూడాలి..

తాజా వార్తలు