కొద్దిరోజులుగా అల్లు అర్జున్,సుకుమార్ మూవీ గురించి ఓ గాస్సిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. పుష్ప మూవీ నుండి తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి తప్పుకున్నారని. ఐతే తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి కేవలం తమిళ్ వర్షన్ లో మాత్రమే చేయనని చెప్పాడట. పుష్ప లో విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తున్న తరుణంలో ఆయన తమిళ్ వర్షన్ లో విలన్ గా కనిపించడానికి ఇష్టపడడం లేదట. అందుకే తమిళ్ వర్షన్ వరకు విజయ్ సేతుపతి రోల్ బాబీ సింహాతో చేయించాలని సుకుమార్ భావిస్తున్నాడని వినికిడి.
ఐతే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ చేస్తున్న మాస్టర్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నారు. అది డైరెక్ట్ తమిళ్ మూవీ, తెలుగులో కూడా విడుదల కానుంది. మరి తమిళ్ లో విజయ్ కి విలన్ గా చేస్తున్న విజయ్ సేతుపతి, బన్నీ పుష్ప తమిళ్ వర్షన్ లో విలన్ గా చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నాడు అనేది ఆశ్చర్యం కలిగిందిస్తుంది. మరి ఇందులో విజయ్ సేతుపతి లాజిక్ ఏమిటో అర్థం కావడం లేదు.