“వకీల్ సాబ్” పరిస్థితి ఏంటి మరి.?

“వకీల్ సాబ్” పరిస్థితి ఏంటి మరి.?

Published on Feb 5, 2021 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కం బ్యాక్ లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అలాగే షూటింగ్ ను పూర్తిగా ముగించుకొని ఆఅల్రెడీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న ఈ చిత్రం పరిస్థితే ఇప్పుడు కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే చాలానే సినిమాలు విడుదలకు దగ్గరలో ఉన్నవి దూరంగా ఉన్నవి కూడా భారీ స్థాయి బిజినెస్ జరుపుకుంటున్నాయి అని టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ పై ఎలాంటి వినిపించడం లేదు.

మరి ఆల్రెడీ బిజినెస్ జరిగిపోయిందా లేక జరగాలా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు