జక్కన్నతో ప్రాజెక్ట్.. మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశేనా?

జక్కన్నతో ప్రాజెక్ట్.. మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశేనా?

Published on Jul 30, 2025 6:30 PM IST

ఎలాంటి అనౌన్సమెంట్ లేనప్పటికీ భారీ హైప్ ఉన్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులు ఒక్క అఫీషియల్ అనౌన్సమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా గత ఏడాది ఆగస్టు 9కి వస్తుంది అనుకున్నారు కానీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ అందించలేదు.

ఇక ఈ ఏడాదికి అయినా వెయిట్ చేద్దాం అంటే ఈసారి కూడా మహేష్ అభిమానులకి నిరాశే మిగిలేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో చూడాలి. ఈ అప్డేట్స్ ఏమో కానీ రాజమౌళి మాత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక నెవర్ బిఫోర్ సినిమాని తెరకెక్కిస్తున్నారని రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా 2027లో విడుదలకి సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు