మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరో మాస్ మాహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే “మాస్ జాతర”. మొదటి నుంచీ మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఇంకా నెల వ్యవధి మాత్రమే ఉంది. కానీ ఈ గ్యాప్ లో కొత్త డేట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
మాస్ జాతర వాయిదా?
రవితేజ నుంచి వస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది మే 9న విడుదల చేయాల్సింది కానీ అది కాస్తా ఆగస్ట్ 27కి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందట.
మరి కొత్త డేట్?
మాస్ జాతర చిత్రం ఆగస్ట్ నుంచి వాయిదా వేసి ఈ ఏడాది దసరా బరిలో నిలపాలనే ప్లాన్ మేకర్స్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే అక్టోబర్ మొదటి వారంలో అలా సినిమా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
మరి ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.