బ్లాక్ బస్టర్ ‘సైయారా’ ఓటిటి డేట్ ఇదేనా?

బ్లాక్ బస్టర్ ‘సైయారా’ ఓటిటి డేట్ ఇదేనా?

Published on Jul 30, 2025 9:00 PM IST

Saiyaara

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రం “సైయారా”. యంగ్ హీరో ఆహాన్ పాండే హీరోగా పరిచయం అవుతూ నటించిన ఈ సినిమా పెను సంచలనంగా నిలిచింది. ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరో డెబ్యూకి కూడా రాని రేంజ్ వసూళ్లు ఈ చిత్రానికి ఇప్పుడు వస్తున్నాయి. ఆల్రెడీ 400 కోట్ల మార్క్ ని దాటిన ఈ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ తో దూసుకెళ్తుంది.

అయితే థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ రానున్న సెప్టెంబర్ 12 నుంచి అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ కి వస్తుందట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు