మేలో వెల్కం ఒబామా సినిమా ఆడియో విడుదల

మేలో వెల్కం ఒబామా సినిమా ఆడియో విడుదల

Published on Apr 24, 2013 6:39 PM IST

Welcome-Obama-(8)

వినూత్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘వెల్కం ఒబామా’ అనే ఎమోషనల్ డ్రామా ద్వారా మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరుకు పూర్తయింది. ఆఖరి మూడో షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ ముగుస్తుంది. ఈ మధ్యే మొదలైన మూడో షెడ్యూల్ మే 3 వరకు సాగుతుంది, ఇందులో కొన్ని పాటలను తియ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వినూత్న రీతిలో మే మూడోవారంలో జరపనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తారాగణం అందరూ కొత్తవాళ్ళే అయినా సినిమా తెరకెక్కిన విధానం పట్ల దర్శకుడు హర్షం వ్యక్తం చేసారు. రాచెల్, ఊర్మిళ, సంజీవ్ మరియు నిరంజని ముఖ్య పాత్రధారులు. శాండల్ వుడ్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాని భారతి కృష్ణ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు