‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !

‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !

Published on Sep 14, 2025 11:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌ నైట్‌ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఐతే, ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మంచు లక్ష్మీ ఖరారు చేసింది. దీంతో, ప్యారడైజ్ లో మోహన్ బాబు విలన్ అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

కానీ, ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించడం లేదు అని, ఆయన గురువు పాత్రలో కనిపించబోతున్నాడని.. హీరో పాత్రకు మోటివ్ గా మోహన్ బాబు పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌ లుక్స్ రిలీజ్ అయ్యాయి.పైగా నాని ఇప్పటివరకు కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా వార్తలు