ఇపుడు ఆల్రెడీ టాలీవుడ్ దగ్గర అదరగొట్టిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ కూడా ఒకటి. మరి ఈ సినిమా వసూళ్లు పరంగా దుమ్ము లేపుతుండగా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు అందుకుంటుంది.
ఇలా యూఎస్ మార్కెట్ లో నేటికి 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని క్రేజీ ఫీట్ ని సెట్ చేస్తే సరిగ్గా ఇదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా ఓజి కూడా ఇదే క్లబ్ జాయిన్ అయ్యింది. కాకపోతే ఇది ఇంకా రిలీజ్ కాలేదు మిరాయ్ అయ్యింది అంతే తేడా అని చెప్పొచ్చు.
ఓజి ఇంకా 10 రోజులు గ్యాప్ ఉండగానే ఈ ఫీట్ అందుకోవడం విశేషం కాగా తేజ సజ్జ కెరీర్ లో హను మాన్ తర్వాత మిరాయ్ ఈ భారీ మైల్ స్టోన్ అందుకోవడం విశేషం. మొత్తానికి ఒకే రోజు ఈ సినిమాలు ఈ క్రేజీ ఫీట్ సొంతం చేసుకొని అదరగొట్టాయి.