ఇలా అయితే సినిమాలు తీయడం మానేస్తాం

murali_mohan
సినీ పరిశ్రమ వారిపై విధిస్తున్న సేవా పన్ను రద్దు చేయాలంటూ ఇటీవలే నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సేవా పన్ను రద్దు చేయకపోతే సినిమాలు తీయడం మానేస్తామని ‘మా’ అధ్యక్షులు మురళీమోహన్ అన్నారు. వాయులింగేశ్వరుని కోసం శ్రీకాళహస్తి వెళ్ళిన ఆయన అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు నిర్మాతల పరిస్థితి అటెండర్ల కన్నా దయనీయంగా ఉంది. ఈ సేవా పన్ను రద్దు విషయం గురించి పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక చిత్ర పరిశ్రమ వారితో కలిసి మాట్లాడి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం గారిని కలుస్తాం. ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పై 12.36 సేవా పన్ను విధించిన విషయం తెలిసిందే. ఈ పన్ను రద్దు విషయమై ఇటీవలే డాక్టర్ డి. రామానాయుడు, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, కైకాల సత్యనారాయణ, వెంకటేష్, జగపతి, నాని, సునీల్, నాగినీడు, అల్లు అరవింద్ పలువురు పరిశ్రమ పెద్దలు ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలిపారు. తెలుగుతో పాటుగా తమిళనాడు, కర్ణాటక చిత్ర పరిశ్రమలు కూడా సేవా పన్ను రద్దు చేయాలని నిరసన తెలుపుతన్నాయి.

Exit mobile version