సీనియర్ నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వినూత్నమైన రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, ఆయన ఇటీవల హోస్ట్‌గా కూడా మారి చేస్తున్న టాక్ షో మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఆయన ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
టాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషన్ ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరో తండ్రిగా చేసిన రాజీవ్ కనకాల పాత్రను తొలుత జగపతి బాబు చేయాల్సింది. దర్శకుడు సాయి మార్తాండ్ ఆ పాత్రను ముందుగా జగపతి బాబుతో చేయించాలని భావించాడట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను జగపతి బాబు వదులుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో జగపతి బాబు తాను ఎంత తప్పు చేశానో గుర్తించాడు.
అందుకే ఆయన ఇప్పుడు తొలిసారిగా నిర్మాతగా మారబోతున్నాడట. ఇందుకు కారణం దర్శకుడు సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్‌తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించడమే. ఇప్పుడు ఈ దర్శకుడు జగపతిబాబు ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మార్తాండ్ స్వయంగా వెల్లడించాడు. “నీతో మరో సినిమా చేస్తాను. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను” అని సాయి మార్తాండ్‌కు మాటిచ్చారట జగపతిబాబు. దీంతో ఇప్పుడు జగపతి బాబు ప్రొడ్యూస్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.