సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్

Demon Slayer

విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకుడు : హరువో సొటొజాకీ
నిర్మాతలు : అకిఫుమి ఫుజియో, మసనొరి మియాకె, యుమా తకహషి
సంగీత దర్శకుడు : యుకి కజియుర, గొ షీనా
సినిమాటోగ్రాఫర్ : యూయిచి తెరావో
ఎడిటర్ : మనబు కమినొ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

జపనీస్ యానిమేషన్ చిత్రం డెమోన్ స్లేయర్ : కిమెట్సు నొ యైబి – ది మూవీ : ఇన్ఫినిటీ క్యాసిల్ (సింపుల్‌గా డెమోన్ స్లేయర్ : ఇన్ఫినిటీ క్యాసిల్) నేడు ఇండియాలో పలు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగులోనూ మంచి బజ్ మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
మ్యూజెన్ ట్రైన్ ఘటనల తర్వాత, తన్జిరో, నెజుకో, జెనిట్సు, ఇనోసుకే, హషిరా అందరూ ముజాన్ కిబుట్సుజి వేసిన భయానక ఉచ్చు – ఇన్ఫినిటీ క్యాసిల్‌లో చిక్కుకుంటారు. అక్కడ మిగతా రాక్షసులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో స్లేయర్స్ ధైర్యం, శక్తి, పట్టుదలని పరీక్షించే యుద్ధాలు మొదలవుతాయి. తన్జిరో అకాజాతో తీవ్రమైన పోరాటానికి దిగుతాడు. ఈ యుద్ధంలో గియూ కూడా అతనికి తోడవుతాడు. వీరు రాక్షసులను జయిస్తారా? లేక మరింత పెద్ద ముప్పును ఎదుర్కొంటారా? అనేది ఈ కథలో ఉత్కంఠను పెంచుతుంది.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో యానిమేషన్ టాప్ నాచ్‌గా ఉందని చెప్పాలి. అందుకే రెగ్యులర్ సినిమాలకంటే ఈ యానిమేషన్ చిత్రానికి ఇంత హైప్ క్రియేట్ అయింది. ఇన్ఫినిటి క్యాసిల్‌లోని విజువల్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అకాజా తన్జిరో మధ్య జరిగే యాద్ధం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమాలో బెస్ట్ సీక్వెన్స్‌గా ఇది నిలిచింది. ఈ ఫైట్‌లో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఆకట్టుకుంటుంది.

ఇక మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ షినొబు డొమా మధ్య వచ్చే సీక్వెన్స్ నిలిచింది. ఒకరిపై ఒకరు వేసే ఎత్తులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దీంతో ఈ సీక్వెన్స్ చక్కగా మెప్పిస్తుంది. జెనిట్లు కైగాకు ల మధ్య వచ్చే యుద్ధం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులోని ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో సెకండాఫ్ బాగా వర్కవుట్ అయింది. ఎమోషనల్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన్జిరొ, జెనిట్సు లు తమ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు.

మైనస్ పాయింట్స్ :
సాధారణ చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలోని నెరేషన్ స్టైల్ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. తరుచూ వచ్చే బ్యాక్‌స్టోరీలు యుద్ధంపై ఆసక్తిని తగ్గిస్తాయి. రిపీటెడ్‌గా ఈ బ్యాక్‌స్టోరీలు వస్తుండటంతో పేస్ నెమ్మదిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లు ముఖ్యంగా అకాజాకి సంబంధించిన ఎపిసోడ్ సాగదీతగా అనిపిస్తుంది.

ఈ సినిమాలోని వాయిస్ యాక్టింగ్, యానిమి పాత్రలు కొత్తగా చూసేవారికి పెద్దగా ఎక్కకపోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో వచ్చే రొటీన్ స్టైల్ కూడా సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి.

తన్జిరొ, అకాజా ఎక్కువ స్క్రీన్ టైమ్‌తో కనిపించడంతో మిగతా పాత్రలు పెద్దగా ప్రభావం చూపలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఇది కూడా సినిమాకు మైనస్ అని చెప్పాలి.

సాంకేతిక విభాగం :
హరువొ సొటొజాకి దర్శకుడిగా మెప్పించాడు. సినిమాలోని సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా ఎంగేజింగ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఈ సినిమాకు సంగీతం నెరేషన్‌కు తగినట్లుగా ఉంటుంది. కెమెగా యాంగిల్స్, ఎడిటింగ్ లాంటివి ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘డెమోన్ స్లేయర్ : ఇన్ఫినిటీ క్యాసిల్’ ఒక డీసెంట్ వాచ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులోని యానిమేషన్, స్టన్నింగ్ విజువల్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. అయితే, సాగదీత సీన్స్, ఆకట్టుకోని ఫ్లాష్‌బ్యాక్స్, కొన్ని పాత్రలు ప్రేక్షకులను మెప్పించవు. ఈ సిరీస్‌ను మందు నుంచి చూస్తున్నవారికి ఈ సినిమా నచ్చుతుంది. కొత్తవారిక మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version