సో “రాధే శ్యామ్” టీజర్లో కొంచెం ఎక్కువే ఆశించొచ్చు.!

సో “రాధే శ్యామ్” టీజర్లో కొంచెం ఎక్కువే ఆశించొచ్చు.!

Published on Feb 10, 2021 7:06 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు “రాధే శ్యామ్” టీజర్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ వింటేజ్ వండర్ టీజర్ ను ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కు సంబంధించిన మిస్టరీ వీడుతుంది అన్న సమయంలో ప్రభాస్ ఫాన్స్ కు కుతూహలం ఎక్కువ అవుతూ వస్తుంది. అయితే మరి ఇదే సమయంలో హీరోయిన్ పూజా హెగ్డే ఈ స్పెషల్ టీజర్ కోసం తన డబ్బింగ్ వర్క్ ను ముగించినట్టుగా క్లారిటీ ఇచ్చి టీజర్ పై మరింత ఇంట్రెస్ట్ తెప్పించేలా చేసింది..

ఎందుకంటే మామూలుగా టీజర్ అంటేనే కేవలం హీరో కోసమే డిజైన్ చేసి ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ లా వదిలేస్తున్న రోజులివి కానీ ఇందుల హీరోయిన్ డైలాగ్ ను కూడా పెట్టారు అంటే అది మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎలాగో హీరోయిన్ గొంతు ఉంది అంటే హీరోది కూడా కన్ఫర్మ్..

సో రాధే శ్యామ్ టీజర్ పై మాత్రం మినిమమ్ అంచనాలు పెట్టుకోవాల్సిందే. ఇక ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ బ్యూటిఫుల్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు