ఎన్నారై లకు ఎస్.పి.బి ‘పాడుతా తీయగా’ లైవ్ లో చూసే అవకాశం

ఎన్నారై లకు ఎస్.పి.బి ‘పాడుతా తీయగా’ లైవ్ లో చూసే అవకాశం

Published on Jun 5, 2013 7:21 AM IST

Padutha-theeyaga

లేజండ్రీ తెలుగు సింగర్ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్న ‘పాడుతా తీయగా’ షో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ చేరువైంది. ప్రస్తుతం ఈ షో 6 వ సీజన్ ప్రారంభమైంది, ఈ షో ని ఎన్నడూ లేనంతగా మొట్టమొదటి సారిగా అమెరికాలో నిర్వహిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్న సింగర్స్ వెలుగులోకి వచ్చారు. ఈ సారి అమెరికాలో ఉన్న తెలుగు వారు ఈ ప్రోగ్రామ్లో పాల్గొని వారి సింగింగ్ స్కిల్స్ ని ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని పలు సిటీలలో నిర్వహిస్తున్నారు. తెలుగు సంగీతం పై అభిమానం ఉన్న వారు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించే ఈ ప్రోగ్రాం ని లైవ్ లో చూడవచ్చు. ఆసక్తిగా ఉన్న ఎన్నారైలు  http://www.etvpt.com  సైట్ ని విజిట్ చేసి టికెట్స్ బుక్ చేసుకోండి లేదంటే మా హోం పేజ్ లోని ‘పాడుతా తీయగా’ యాడ్ పై క్లిక్ చేసి టికెట్స్ బుక్ చేసుకోండి.

తాజా వార్తలు