రాజమౌళి సినిమాలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే రికార్డ్స్ గురించి మాట్లాడుకోవలసిందే, హిట్ అండ్ ప్లాప్ అనే మాటలు పరిగణలోకి రావు. మరి ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒక చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే కొత్త చిత్రం కోసం ఆయనకు అడ్వాన్సులు ఇస్తారు. అంత డిమాండ్ దర్శకుడిగా రాజమౌళి కి ఉంది. కాగా ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి నిర్మాతగా డి వి వి దానయ్య ఉన్నారు.
దానయ్య రాజమౌళికి ఏళ్ల క్రితమే ఓ మూవీ కోసం అడ్వాన్స్ ఇవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ ఆయన నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ మూవీ నిర్మాతగా చిరంజీవి ఉండాలని భావించారట. రాజమౌళితో ఈ విషయం కూడా చిరంజీవి చర్చించారట. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం రీత్యా రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అలాగే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ తనకు ఇచ్చేయమని భారీ అమౌంట్ ని దానయ్యకు ఆఫర్ చేశారట. కానీ దానయ్య ఆ ఆఫర్ ని తీసుకుకోకుండా తానే నిర్మిస్తున్నారు.