‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !

‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !

Published on Aug 18, 2025 11:01 AM IST

war2

భారీ స్థాయిలో వచ్చిన ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ కూడా భారీగానే ఉంది. మరి హిందీ కలెక్షన్ల పరిస్థితికి వస్తే.. హిందీలో ‘వార్ 2’ 4వ రోజు భారీ కలెక్షన్లను సాధించింది. 4వ రోజు ₹25 కోట్లు నెట్ ను సాధించింది. ఇక హిందీలో మొత్తం 4 రోజులకు గానూ ₹123 కోట్లు నెట్ ను సాధించింది.

హిందీతో సహా తెలుగులో ‘వార్ 2’ సత్తా చాటుతుంది. ఆగష్టు 15 హాలిడే కి సాలిడ్ జంప్ అందుకుంది. ముఖ్యంగా హిందీ నెట్ లో ఏకంగా 55 శాతం జంప్ ని ఈ సినిమా అందుకుంది. మొత్తానికి టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ రాబడుతుంది. అయితే, నేడు సోమవారం నుంచి కలెక్షన్స్ ను ఈ సినిమా రేంజ్ ఆధారపడి ఉంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు అయాన్ ముఖర్జీ పని చేయగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు