ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2”. హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ లతో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ ఏక్షన్ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పుడు అదరగొడుతుంది. అయితే ఈ ట్రైలర్ తో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పవచ్చు.
గతంలో వచ్చిన టీజర్ పట్ల ఒకింత హృతిక్ వైపు గాలి వీచింది. కానీ ఈ సారి ఆ తప్పిదాలు జరగలేదు. హృతిక్ తో పాటుగా నిజానికి ఒకింత ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది అని చెప్పవచ్చు. తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ గాని ట్రైలర్ లో ఊహించని లెవెల్లో ఉన్నాయి. ఇదే రీతిలో సినిమాలో కూడా ఉంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ బద్దలవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎన్టీఆర్ ని అయాన్ ఎలా హ్యాండిల్ చేసాడో చూడాల్సిందే.