‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మన టాలీవుడ్ యూత్ లో మంచి అట్రాక్షన్ ను తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన మార్క్ యాటిట్యూడ్ తో అలరించాడు. ఇక ఇదిలా ఉండగా తాను అటెంప్ట్ చేసిన మరో యూత్ ఫుల్ ప్రాజెక్ట్ “పాగల్”. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం వహించారు.
మరి అలా మంచి బజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం తాలూకా టీజర్ ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఈ టీజర్ లో విశ్వక్ మంచి ఫ్రెష్ యాంగిల్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి. అలాగే ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామాలా కూడా ఇది అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే విశ్వక్ సేన్ ఈ టీజర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాడు మంచి స్టైలిష్ లుక్స్ యాటిట్యూడ్ ఇంకా యాక్షన్ లో పర్ఫెక్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు.
ఇక చివర్లో రాహుల్ రామకృష్ణ తో చిన్న కామెడీ బిట్ హిలేరియస్ గా ఉంది. ఇంకా రాధన్ మ్యూజిక్, ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీలు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఈ టీజర్ బాగానే ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉందొ తెలియాలి అంటే వచ్చే ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి