విశ్వరూపం సినిమాకి బిగుసుకున్న ఉచ్చు.!

విశ్వరూపం సినిమాకి బిగుసుకున్న ఉచ్చు.!

Published on Jan 29, 2013 5:00 PM IST

Vishwaroopam

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మించి, నటించిన సినిమా ‘విశ్వరూపం’. ఈ సినిమాని తమిళనాడులో నిషేదించారు. చెన్నై నుండి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా పై మరికొన్ని ఉచ్చులు బిగుసుకున్నాయి. తమిళనాడు గవర్నమెంట్ అటార్నీ జనరల్ విశ్వరూపం సినిమా నిషేదాన్ని సమర్ధించారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారని ప్రశ్నించారు.

ఇది కాకుండా ఆంద్ర ప్రదేశ్లో మొహమ్మద్ హాజీ అనే బిజినెస్ మాన్ ‘విశ్వరూపం’ సినిమాని నిషేదించాలని హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ సినిమాలో ముస్లీం కమ్యూనిటీకి వ్యతిరేకంగా, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని అందులో తెలిపాడు. ఈ విషయంపై హై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తమిళ మూవీ లవర్స్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు