యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. తెలుగు సినిమా నుంచి మరో సాలిడ్ వర్క్ గా వచ్చిన ఈ సినిమా తేజ సజ్జ కెరీర్లో మరో భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కనిపిస్తుంది. మరి యూఎస్ మార్కెట్ లో అయితే “మిరాయ్” భారీ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.
ప్రీమియర్స్ సహా డే 1 నాటికి సినిమా ఏకంగా 7 లక్షల డాలర్స్ ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. దీనితో మన మిడ్ రేంజ్ హీరోస్ లో తేజ సజ్జ ఒక సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ కి ఈ సినిమా ఈజీగా 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అత్యున్నత ప్రమాణాలతో సినిమాని నిర్మాణం వహించారు.