పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులు సెట్ చేస్తుందో అని ఇపుడు నుంచే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాకి కూడా ముందు రోజే తెలుగు స్టేట్స్ లో పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని ఇది వరకే టాక్ వచ్చింది.
అయితే తెలంగాణలో కొంచెం కష్టం అయితే ఏపీలో మాత్రం డెఫినెట్ గా ముందే షోస్ పడిపోతాయని ఇపుడు వినిపిస్తుంది. రిలీజ్ ముందు రోజు అంటే సెప్టెంబర్ 24 రాత్రి 9 లేదా 9 గంటల 30 నిమిషాలకే షోస్ పడిపోయే ఛాన్స్ లు ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.