యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో విశ్వక్ నటనకు ప్రశంశలు దక్కాయి. నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. కాగా ఈ యంగ్ హీరో ఫేవరేట్ టాలీవుడ్ స్టార్ ఎవరంటే టక్కున ఎన్టీఆర్ పేరు చెప్పాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ మాట్లాడుతూ.. ”తెలుగులో నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఆయన. ఏ సీన్ అయినా సింగిల్ టేక్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇక స్టైలిష్ హీరో అల్లు అర్జున్ కాగా, హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. మల్టీస్టారర్ మూవీలో నటించే అవకాశం వస్తే.. నాని అన్నతో నటించాలని ఉందన్నాడు. ఇక దర్శకుల విషయానికొస్తే, నా అభిమాన దర్శకుడిగా తరుణ్ భాస్కర్” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.